మెల్‌బోర్న్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విజయం సాధించి, డబ్లుటిసి ఫైనల్‌కు దూసుకెళ్లి ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు సారథి ప్యాట్ కమ్మిన్స్‌కు జట్టుకు దరమయ్యాడు. పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్ ట్రోఫీకి అందుబాటు లో ఉండటంలేదని సమాచారం. తాజాగా ఆ స్ట్రేలియా క్రికెట్ బోర్డ్.. లంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. ఇందులో కమిన్స్ పేరు లేదు. వ్యక్తిగత కారణాలతో అతడు అందుబాటులో ఉండట్లేదని తెలిపింది. ఎందుకంటే లంకతో సిరీస్ జరిగే సమయానికి కమిన్స్ భార్యకు రెండో డెలివరీ అయ్యే అవకాశం ఉంది.
దీంతో పాటే క మ్మిన్స్‌కు ప్రస్తుతం చీలిమండ గాయమైంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెలీ చెప్పాడు. కమిన్స్‌కు త్వరలోనే గాయం తీవ్రత తెలుసుకోవడానికి చికత్సకు వెళ్లనున్నాట్టు అత డు చెప్పుకొచ్చాడు. గాయం తీవ్రత ఎక్కువైతే కమ్మిన్స్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకా శం ఉందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బెలీ మాట్టాడుతూ.. “కమిన్స్‌కు చీలమండ గాయమైంది.
నాకు తెలిసి వచ్చే వారం అతడు స్కానింగ్‌కు వెళ్తాడు. రిపోర్ట్‌లో అతడి గాయం తీవ్రతపై ఓ స్పష్టత వస్తుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు పాల్గొంటాడా లేదా అనేది ప్రస్తుతం కచ్చితంగా చెప్పలేం’ అని అన్నాడు. కాగా, ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్‌బిలో ఉంది. ఈ కేటగిరీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.