Friday, January 10, 2025

నెక్నాంపూర్ లో  హైడ్రా కూల్చివేతలు

- Advertisement -
- Advertisement -

నెక్నాంపూర్ లో హైడ్రా కూల్చివేతలు
పెద్ద చెరువులో వెలసిన విల్లాలపై చర్యలు

హైదారాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ లోని పెద్ద చెరువులో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువులో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల లో వెలిసిన విల్లాల అనుమతులు రద్దు చేసినా నిర్మాణాలు కొనసాగడంపై హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం క్షేత్ర స్థాయిలో హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఎఫ్ టిఎల్ పరిధిలో వున్నాయని గతంలో కొన్నిటిని కూల్చినట్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు కమిషనర్ రంగనాథ్ కు వివరించారు. మున్సిపాలిటీ, ఇరిగేషన్ నోటీసులు పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగడంపై కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం నుంచే హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు వుండడంతో కోర్టుకు సమాచారం ఇచ్చి కూల్చివేశారు. మొత్తం 13 విల్లాలు కాగా.. ఒక్కొక్కటి 400 గల విస్తీర్ణంలో ఒన్ ప్లస్ టూ గా నిర్మాణం ఉందని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ నగర శివారులోని గండిపేట చేరువులోని నార్సింగి ప్రాంతంలో మూసీ నదిలో రాజపుష్ప నిర్మాణ సంస్థ మట్టి పోసిన విషయం తెలిసిందే. రాజపుష్ప నిర్మాణ సంస్థపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. అనంతరం మూసీలో పోసిన మట్టిని సదరు నిర్మాణ సంస్థ తొలగించినట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News