హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారని సైబర్ క్రైమ్ డిసిపి కవిత తెలిపారు. సైబర్ నేరాలు చేస్తున్నా ముఠాను ఉత్తర ప్రదేశ్‌లో పట్టుకున్నామని తెలియజేశారు. సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన సందర్భంగా డిసిపి కవిత మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరాల ముఠాలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. అనుమానిత కాల్స్, మెసేజ్‌లు వస్తే స్పందించకూడదని, ఒక వేళ స్పందిస్తే ఖాతా నుంచి డబ్బులు పోయే ప్రమాదం ఉందన్నారు. ఆ నాలుగు రాష్ట్రాలలో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామన్నారు. తెలంగాణలో 30 కేసులు, దేశ వ్యాప్తంగా 328 కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు గుర్తించామని వివరించారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లు, సిమ్‌కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. నిందితులు పలు రకాల సైబర్ నేరాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. కర్నాటక నుంచి మరో ఇద్దరు సైబర్ నేరగాళ్లను పట్టుకున్నామని కవిత స్పష్టం చేశారు.
23 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -