Saturday, January 11, 2025

కెసిఆర్‌తో కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

ఫార్ములా- ఈ కార్ రేస్ కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కెటిఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డిలు కెసిఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన ఎసిబి విచారణకు సంబంధించిన పలు అంశాలను కెసిఆర్ దృష్టికి కెసిఆర్ తీసుకువెళ్లారు. ఎసిబి విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను చెప్పిన సమాధానాలను వివరించారు. అలాగే ఈనెల 16వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఇడి) విచారణకు హాజరుకావాల్సి ఉందని కెసిఆర్‌కు కెటిఆర్ తెలిపారు. దీంతో ఈనెల 16న ఇడి విచారణను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై కెటిఆర్‌కు అధినేత దిశానిర్దేశం చేశారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు, కేసులతోపాటు పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపైనా నేతలకు కెసిఆర్ సూచనలు చేశారు.

1+6 ఆఫర్ సీఎం వ్యవస్థను ఎప్పుడూ చూడలేదెమో : కెటిఆర్ సెటైర్లు
తెలంగాణలో ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే.. ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో అని కెటిఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. వికారాబాద్ సిఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని విమర్శించారు. ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సిఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటునని అన్నారు. సిఎం ఎంపిక కోసం ఐవీఆర్‌ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అని రేవంత్ రెడ్డికి ఒక చిన్న విన్నపం చేస్తున్నట్లు కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News