పంజాగుట్ట పోలీసులు తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో బిఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు పిటిషన్ దాఖలు కేసులో ఇప్పటికే హారీష్ రావును అరెస్ట్ చేయొద్దని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్ గౌడ్ కు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దనే ఉత్తర్వులను పొడిగించింది.
ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుపై సిద్దిపేట నుంచి చక్రధర్ గౌడ్ పోటీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో తాను పలు సేవా కార్యక్రమాలు చేశానని, హరీశ్‌రావు తనపై కక్షగట్టి క్రిమినల్ కేసుల్లో ఇరికించారని, తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్‌రావును అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.