Thursday, February 6, 2025

కార్చిచ్చు వెనుక కుట్రకోణం

- Advertisement -
- Advertisement -

కార్చిచ్చు ప్రళయం ఇంకా లాస్‌ఏంజెలెస్‌ను విడిచిపెట్టడం లేదు. రాత్రీ పగలనక జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వీటికి పొడిగాలులు తోడు కావడంతో ఊహించని రీతిలో మంటలు కమ్ముకుంటున్నాయి. ఇక్కడి పొగ, మంటలు, అంతరిక్షం లోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతవరకు మృతుల సంఖ్య పదికి చేరింది. ఈ విషయాన్ని లాస్ ఏంజెలెస్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ వెల్లడించారు. అయితే ఇంకా మృతులను ఇంకా గుర్తించలేదని చెప్పారు. దాదాపు 10,000 ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు బూడిదయ్యాయి. దాదాపు రూ. 12 లక్షల కోట్ల వరకు ఆస్తులకు నష్టం జరిగినట్టు అంచనా. కొత్తగా జ్వాలలు కమ్ముకొస్తుండడంతో ప్రజలు తమ నివాస ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 1,80,000 మంది ఖాళీ చేయాల్సి ఉంది. దట్టంగా పొగకమ్ముకు రావడంతో లాస్‌ఏంజెలెస్ యూనిఫైడ్ డిస్ట్రిక్టులో అన్ని స్కూళ్లు శుక్రవారం మూతపడ్డాయి.

వెంచురా కౌంటీకి అతి సమీపానగల వెస్ట్‌హిల్స్ దగ్గర ఉన్న శాన్‌ఫెర్నాండో వ్యాలీలో మధ్యాహ్నం కెన్నెత్ ఫైర్ భారీ ఈదురు గాలులతో చాలావేగంతో కమ్ముకు వస్తోందని లాస్‌ఏంజెలెస్ మేయర్ కారెన్‌బాస్ హెచ్చరించారు. పసడేనా సమీపాన మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈటన్‌ఫైర్ 5000 నిర్మాణాలను తుడిచిపెట్టింది. వీటిలో ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, వ్యాపార సంస్థలు, వాహనాలు ఉన్నాయి. పసిఫిక్ పాలిసేడ్స్ వరకు లాస్‌ఏంజెలెస్ ఏరియాలో మొత్తం 5300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి. ఈటన్, పాలిసేడ్స్ ఫైర్స్ మధ్య 10,000 కు పైగా నిర్మాణాలు దగ్ధమయ్యాయి. పాలిసేడ్స్‌లో ఒక హైస్కూలులో అగ్నిబాధితులు ఆశ్రయం పొందుతున్నారు. వీరికి దూరంగా రెండు మైళ్ల వరకు కెన్నెత్ ఫైర్ వ్యాపించింది. మాలిబులో ఐదు చర్చిలు, ఏడు స్కూళ్లు, రెండు లైబ్రరీలు, బార్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు, గ్రాసరీ షాపులు నాశనమయ్యాయి. ప్రభుత్వం ఇంతవరకు ఎంత నష్టం జరిగిందో వెల్లడించలేదు. ప్రైవేట్‌సంస్థ ఆక్యూవెదర్ వెల్లడించిన డేటా ప్రకారం 135 బిలియన్ నుంచి 150 బిలియన్ డాలర్ల వరకు నష్టం ఏర్పడినట్టు తెలుస్తోంది.

ఈటన్, పాలిసేడ్స్ జ్వాలలను కొంతవరకు తగ్గించగలిగామని అగ్నిమాపక సిబ్బంది గురువారం చెప్పారు. హాలీవుడ్ హిల్స్‌లో .జ్వాలలను కొంతవరకు తగ్గించగలగడంతో గురువారం అక్కడి ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయడానికి వీలుపడింది. బుధవారం వరకు హాలీవుడ్‌లో కార్చిచ్చు ప్రళయంగా వ్యాపించి మొత్తం ఫిలిం పరిశ్రమనే ధ్వంసం చేసింది. ఇంకా జ్వాలలు భయంకరంగా ఉంటున్నాయని,ఇవి తగ్గుతాయన్న ఆశాభావంతో ఉంటున్నామని లాస్ ఏంజెలెస్ కౌంటీ సూపర్‌వైజర్ కాత్రిన్ బార్జెర్ పేర్కొన్నారు. హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చిమ్మి హాలీవుడ్‌హిల్స్, స్టుడియో సిటీ మంటలను వేగంగా ఆర్పగలిగారు. తాజాగా మాక్సర్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు పాలిసాడ్స్ ఫైర్, ఎటన్‌ఫైర్ బీభత్సాన్ని కళ్లకు కట్టాయి.ఈ రెండు ఫైర్లు మొత్తం 34 వేల ఎకరాలను బూడిద చేశాయి. ఈ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని దోపిడీకి పాల్పడిన 20 మందిని అరెస్ట్ చేశారు. శాంటామోనికాలో బుధవారం రాత్రి నుంచి కర్ఫూ విధించారు.

ఇళ్లు కోల్పోయిన హాలీవుడ్ నటులు
బిల్లీక్రిస్టల్, మాండీ మోర్, పారిస్ హిల్టన్, తదితర సెలెబ్రెటీలు, హాలీవుడ్ నటులు ఈ కార్చిచ్చులో తమ ఇళ్లను కోల్పోయారు. అగ్నిబాధితులకు సాయం చేసేందుకు ఒక మిలియన్ డాలర్లతో జేమీ లీ కర్టిస్ నిధిని ప్రారంభించారు.
కాలిఫోర్నియా కార్చిచ్చు సీజన్
కాలిఫోర్నియా కార్చిచ్చు సీజన్ వేగంగా ప్రారంభమైంది. ఆలస్యంగా ముగుస్తుంది. అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం చాలా స్వల్పం కావడంతో వాతావరణం అసాధారణంగా తయారైందని అధికారులు చెబుతున్నారు.పొడిగాలుల వల్ల దక్షిణ కాలిఫోర్నియాలో సరాసరి ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ స్థాయిలో వేడి పెరిగింది. గత మే నుంచి కనీసం 2.5 మిమీ అయినా వర్షం కురియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News