Saturday, January 11, 2025

గుజరాత్‌లో 8 ఏళ్ల బాలునికి హెచ్‌ఎంపివి ఇన్ఫెక్షన్

- Advertisement -
- Advertisement -

గుజరాత్ సబర్కాంతా జిల్లాలో ఒక ఎనిమిది సంవత్సరాల బాలునికి ‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్’ (హెచ్‌ఎంపివి) ఇన్ఫెక్షన్ సోకిందని, దీనితో రాష్ట్రంలో హెచ్‌ఎంపివి కేసులు మూడుకు పెరిగాయని అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ప్రాంతిజ్ తాలూకాలో వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన ఆ బాలునికి ఒక ప్రైవేట్ ల్యాబోరేటరీ నిర్వహించిన పరీక్షలో హెచ్‌ఎంపివి పాజిటివ్‌గా తేలిందని, కానీ అతని రక్త నమూనాలను ధ్రువీకరణ నిమిత్తం ఒక ప్రభుత్వ ల్యాబ్‌కు ఆరోగ్య శాఖ అధికారులు పంపించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం హిమ్మత్‌నగర్ పట్టణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆ బాలుని ఇప్పటి వరకు అనుమానిత హెచ్‌ఎంపివి కేసుగా పరిగణించారు. ‘బాలునికి హెచ్‌ఎంపివి సోకిందని ప్రభుత్వ ల్యాబ్ శుక్రవారం ధ్రువీకరించింది. అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి స్థిరంగా ఉంది’ అని సబర్కాంతా జిల్లా కలెక్టర్ రతన్‌కన్వర్ గధావిచరణ్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News