- Advertisement -
ఏడాది కాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్న జంట తమ ప్రేమను గెలిపించేందుకు తనువు చాలించారు. సంగారెడ్డి జిల్లా, నిజాంపేట్ గ్రామానికి చెందిన కార్పే ఉదయ్‌కుమార్, మంగలి రోహిత గత సంవత్సరం కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే, అమ్మాయి తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. దీంతో గురువారం వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి, మునిపల్లి మండల పరిధిలోని హరిత రిసార్ట్‌లోని ఓ గదిలో ఉరివేసుకొని మృతి చెందారు. రెండు కుటుంబాల సభ్యులు నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -