అమరావతి: వీడియో చిత్రీకరణ కోసం బాలికకు మాయమాటాల చెప్పి ఆమెను ఫన్ బకెట్ భార్గవ్ శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చడంతో అతడికి విశాఖపట్నం పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు నాలుగు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నంలోని నాయుడు తోటకు చెందిన చిప్పాడ భార్గవ్(27) అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ అనే యువకుడు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అతడి వీడియోలు వైరల్ కావడంతో నటనపై మక్కువ ఉన్నవారు అతడితో కలిసి వీడియోలు చేశాడు.
భార్గవ్ కొంత మంది యువతితో కలిసి వీడియోలు చేశాడు. అతడి వద్ద పని చేసే యువతులను లైంగికంగా వేధించడంతో భార్గవ్‌ను దూరం పెట్టారు. నటనలో మక్కువతో 14 ఏళ్ల బాలిక భార్గవ్‌ను కలిసింది. ఈ క్రమంలో బాలికతో వీడియోలు చేయడంతో భార్గవ్ ఆమెను చెల్లి అని పిలవడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అశ్లీల చిత్రాలు తీసి బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక శరీరంలో మార్పులు రావడంతో ఆమె తల్లి పరీక్షలు చేయించింది. గర్భం దాల్చిందని అని తేలడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో 2021 ఏప్రిల్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడేనని తేలడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విశాఖపట్నం పోక్సో న్యాయస్థానం అతడి 20 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించింది.