తిరువనంతపురం: ఓ అథ్లెట్‌పై ఒకరు అత్యాచారం చేయడంతో పాటు 60 మంది లైంగికంగా వేధించారు. ఈ సంఘటన కేరళలోని పథన్ తిట్ట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 18 ఏళ్ల యువతి అథ్లెట్‌గా రాణిస్తున్నారు. 13 సంవత్సరాల వయసులో పక్కింటి వ్యక్తి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించిడంతో బాలిక మౌనంగా ఉంది. పలువురు కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా తనని లైంగికంగా వేధించారు. వేధింపులు ఎక్కువగా కావడంతో ఆమె ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించింది. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. 62 అనుమానితుల్లో 40 మందిపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు నిందితుల్లో ఐదుగురు సుబిన్, సందీప్, వికె వినీత్, కె అనందు, శ్రీనిని అరెస్టు చేశామన్నారు. బాధితురాలుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూచించింది.
అథ్లెట్‌పై ఒకరు అత్యాచారం… 60 మంది లైంగిక వేధింపులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -