Saturday, January 11, 2025

ఆ భూములకు రైతుభరోసా ఉండదు: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతుభరోసా, ఇళ్లు ఇవ్వడంలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అలాంటివి నమ్మొద్దు అని, వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నవారందరికీ రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. రైతుభరోసాకు ఎకరాకు సంవత్సరానికి 12 వేలు ఇవ్వబోతున్నామన్నారు. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు అర్హులందరికీ అందిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి ఇళ్ల పటాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. కొండలు, గుట్టలు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు మాత్రమే రైతుబంధు ఉండదని స్పష్టం చేశారు. ఎవరూ అభద్రతకు లోనుకావద్దని, అన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ నెల 26న మరో నాలుగు పథకాలు అమలు చేస్తామని, సంక్రాంతి పండుగ కానుకగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, గత ప్రభుత్వంలో కట్టకుండా వదిలేసిన ఇళ్లను కూడా నిర్మించి ఇస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని, నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తామని, ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని పొంగులేటి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News