Saturday, January 11, 2025

ప్రతీ తండాలో స్కూల్, అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తాం: ఉత్తమ్ కుమార్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఆదివాసీ గిరిజన అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివాసీ గిరిజనులను అని విధాలా ఆదుకుంటామన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో జరిగిన ఆదివాసీ గిరిజనుల సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. బడ్జెట్‌లో ఆదివాసీలకు పది శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  కెసిఆర్ సర్కార్ పదేళ్లలో ఆదివాసీ గిరిజనులను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.  గ్రామ పంచాయితీలకు గత సర్కార్ మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. ప్రతీ తండాలో స్కూల్, అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. మంత్రులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.  ఆదివాసీ గిరిజనుల సభకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంఎల్‌ఎ జైవీర్‌లు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News