Saturday, January 11, 2025

ధరణితో ఓ కుటుంబం లాభపడింది: బండి

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: ధరణి పేరుతో బిఆర్ఎస్ నాయకులు కొంపలు ముంచారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకొని దివ్యాంగులకు కాలనీ కట్టాలని డిమాండ్ చేశారు. రాజన్నసిరిసిల్ల పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇష్టాను రీతిన మాట్లాడితే సమాజం గుర్తించదని, పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని బండి సంజయ్ తెలిపారు. ధరణితో ఓ కుటుంబం లాభపడిందని, కబ్జా భూములు స్వాధీనం చేసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేయొద్దని ఆయన కోరారు. ఈ విషయంలో మా సహకారం ఉంటుందని బండి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News