ఢిల్లీ శాసనసభ ఎన్నికలు మరి కొన్ని వారాల్లో జరగనుండగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశ రాజధానిలో తన వంతుగా సోమవారం ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. ఈశాన్య ఢిల్లీలోని శీలంపూర్‌లో ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని పార్టీ శనివారం వెల్లడించిందివ. ఎఐసిసి ఢిల్లీ ఇన్‌చార్జి ఖాజీ నిజాముద్దీన్ ఢిల్లీ పిసిసి కార్యాలయంలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ,
రాహుల్ గాంధీ దేశ ప్రజల వాణిగా ఆవిర్భవించారని చెప్పారు. ఎక్కడ ఒక సమస్య ఉంటే రాహుల్ అక్కడికి వెళ్లి ప్రజల వాణి వినిపిస్తుంటారని నిజాముద్దీన్ తెలిపారు. ‘కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈశాన్య ఢిల్లీ శీలంపూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అధిక సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సభలో పాల్గొంటారు’ అని నిజాముద్దీన్ చెప్పారు.