Sunday, January 12, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతుంటాయి. ఒక సారి తగ్గితే, మరొకసారి పెరుగుతూ ఉంటాయి. ఈ నెల 1 నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం ధరలతో పోల్చుకుంటే శనివారం భారీగా పెరిగాయి. సోమవారం పది గ్రాముల పసిడి ధర రూ. 79470గా ఉండగా, శనివారానికి రూ. 1332 మేర పెరిగి రూ. 80802 స్థాయికి చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ. 90020గా ఉండగా,

శనివారానికి రూ. 3245 మేర పెరిగి రూ. 93265 స్థాయికి చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, పొద్దుటూరులలో శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఈ ధరలు ఉన్నాయి. అయితే, పుత్తడి, వెండి ధరలు రోజురోజుకు మారుతుంటాయనేది వినియోగదారులు గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఔన్స్ బంగారం ధర 2640 డాలర్లు ఉండగా, శనివారానికి 50 డాలర్లు పెరిగి 2690 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 30.43 డాలర్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News