భువనగిరి కార్యాలయంపై విరుచుకుపడిన
కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు
ఆఫీస్ ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం
రేవంత్‌పై బిఆర్‌ఎస్ నేతలు అనుచిత
వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్, అనుబంధ సంఘాల ఎన్‌ఎస్‌యుఐ నా యకులు దాడికి పాల్పడ్డారు. శనివారం జిల్లా బి ఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ పైళ్ల శే ఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. బిఆర్‌ఎస్ కా ర్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్, అద్దాలు ధ్వం సం చేశారు. ముఖ్యమంత్రిపై బిఆర్‌ఎస్ జిల్లా అ ధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్య లు చేశారంటూ మండిపడ్డారు. ఆయన చేసిన అ నుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. వెంటనే సిఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను సైతం ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను వెంటనే శిక్షించాలి: మాజీ ఎంఎల్‌ఎ పైళ్ల
జిల్లాలో అరాచక పాలన సాగించకుండా, జిల్లా ప్రశాంతంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, జిల్లా కేంద్రంలో ఎంఎల్‌ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి , శాంతి భద్రతలు కాపాడుకోలేకపోతున్నారని మాజీ ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి ఆరోపించారు. శనివారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. భువనగిరిలో శాంతి భద్రతలు కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారం చూసి కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారాని మండిపడ్డారు.
విలేఖరుల సమావేశంలో పరస్పర వ్యాఖ్యలు చేసుకొవడం మామూలేనని, అది గ్రహించని కాంగ్రెస్ దుండగులు బిఆర్‌ఎస్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడ్డారని విమర్శించారు. తమ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పట్టణ పోలీసులను కోరారు. పోలీసులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని, పోలీస్ అధికారులు అధికార వర్గానికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల అమరెందర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు జనగాం పాండు, ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్, ర్యాకల శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.