అందుకే సుంకిశాలపై విజిలెన్స్
నివేదికను తొక్కిపెడుతున్నారు
మేఘాను బ్లాక్‌లిస్టులో పెట్టాలని
నివేదికలో సిఫార్సు చేసింది వాస్తవం
కాదా? మేఘా నిర్లక్షం వల్లే
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలి
రూ.80కోట్ల ప్రజాధనం వృథా
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సుంకిశాల ఘ టనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చ ట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పే ర్కొన్నారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర త ప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరం అని ఆశ్చర్యం వ్యక్తం చేశా రు. మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలనే కమి టీ రిపోర్ట్‌ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సిఎం రేవంత్, మేఘా కృ ష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే నని ఎక్స్ వేదికగా కెటిఆర్ ఆరోపించారు. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని, హైదరాబాద్‌లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడిందని అన్నారు. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గ తం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోందని, సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టే అని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇం డియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని విమర్శించారు. తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పా వుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొం గులేటికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరి సగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీశారని అన్నారు. ఇప్పటికైనా స మాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలని హితవు పలికారు. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు మునిగి ఐదుగురు యువకులు మరణించడం బాధాకరమని కెటిఆర్ పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యుక్తవయసులోనే యువకులు అకాలమరణం చెందడం వారి కుటుంబాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు.