Sunday, January 12, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్: హీరో వెంకటేశ్

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 14న ’సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్‌తో ఇంటర్వూ విశేషాలు…
క్లీన్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్…
నా కెరీర్ ఇది మరో సంక్రాంతి. ఒక క్లీన్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌తో రావడం చాలా ఆనందంగా వుంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా వుంది. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. నా కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన ఎక్కువ సినిమాలు చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం వుంది.
సరదాగా నేనే పాడతానని అన్నాను…
నేను పాడిన పాటలో ఏదో క్రేజీ ఎనర్జీ ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే వుంది. ఇంగ్లీష్ పదాలు వుండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది. ఇందులో రమణ గోగుల పాడిన పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా వుంది.
కామెడీ కొంచెం డిఫరెంట్‌గా…
ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ స్టోర్ లైన్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. దర్శకుడు అనిల్ రావిపూడి, నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా వుంటాం. ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్ గా వుంటుంది. ఫ్రెష్ సీన్స్ వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇక మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. చక్కగా నటించారు.
పాటలకు అద్భుతమైన స్పందన…
భీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తనకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో చేశాడు. ఫస్ట్ ట్యూన్ వినగానే హిట్ అనుకున్నాం. అది సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అది ఆడియన్స్ గొప్పదనం. గోదారి గట్టు పాట 85 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అన్ని పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
డైలాగ్స్ చాలా క్రేజీగా…
ఇందులో క్లైమాక్స్ లో చెప్పే డైలాగ్స్ చాలా క్రేజీగా ఉంటాయి. ఆడియన్స్ చాలా ఎంటర్‌టైన్ అవుతారు. ఇందులో నాకు నలుగురు పిల్లలు. అందులో ఒకడిని చాలా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది.
వారితో జర్నీ చాలా కంఫర్ట్‌బుల్‌గా…
దిల్ రాజు ప్రొడక్షన్‌లో సీతమ్మ వాకిట్లో సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. వారితో జర్నీ చాలా కంఫర్ట్‌బుల్‌గా వుంటుంది. మేము చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను. 70 రోజుల్లోనే ఈ సినిమాని పూర్తి చేయడం హ్యాపీగా అనిపించింది. అనుకున్న దాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి.
తదుపరి చిత్రాలు…
‘రానా నాయుడు 2’ మార్చిలో రావచ్చు. డబ్బింగ్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్, సితార వంశీ, మైత్రీ, వైజయంతి మూవీస్ లో కథలపై వర్క్ జరుగుతోంది. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News