Monday, January 13, 2025

ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి జైశంకర్ ప్రాతినిధ్యం

- Advertisement -
- Advertisement -

అధ్యక్షుడుగా 20న ప్రమాణం స్వీకరించనున్న ట్రంప్

న్యూఢిల్లీ : యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) 47వ అధ్యక్షుడుగా ఈ నెల 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భారత్ ప్రతినిధిగా హాజరవుతారు. జైశంకర్ తన యుఎస్ పర్యటనలో రానున్న ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సమావేశాలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఇఎఎం) ఆదివారం వెల్లడించింది. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించిన విషయం విదితమే. భారత్‌పై ట్రంప్‌నకు సకారాత్మక రాజకీయ దృక్పథం ఉందని, ఆయన ప్రభుత్వంతో ‘ప్రగాఢ’ సంబంధాలు నిర్మించి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి అనేక ఇతర దేశాల కన్నా భారత్ ఎక్కువ అవకాశవాద పరిస్థితిలో ఉందని జైశంకర్ క్రితం నెల చెప్పారు.

‘అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ జె ట్రంప్ యుఎస్‌ఎ 47వ అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న కార్యక్రమానికి ‘ట్రంప్ వాన్స్ ప్రమాణ స్వీకారోత్సవ కమిటీ ఆహ్వానంపై భారత ప్రభుత్వానికి విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నారు’ అని ఎంఇఎ తెలియజేసింది. జెడి వాన్స్ యుఎస్ నూతన ఉపాధ్యక్షుడు. ‘ఈ పర్యటనలో విదేశాంగ శాఖ మంత్రి రానున్న ప్రభుత్వ ప్రతినిధులతోను, ఆ సందర్భంగా యుఎస్‌ను సందర్శించే ఇతర ప్రముఖులు కొందరితోను కూడా సమావేశాలు జరుపుతారు’ అని ఎంఇఎ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ యుఎస్‌కు అధ్యక్షుడు కావడం ఇది రెండవ సారి. ఆయన 2017 జనవరి నుంచి 2021 జనవరి వరకు యుఎస్ 45వ అధ్కక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News