Monday, January 13, 2025

ఇరా వీరవిహారం

- Advertisement -
- Advertisement -

వన్లేల్లో త్రిపుల్ సెంచరీ బాదిన మహిళా బ్యాటర్‌గా రికార్డు

ముంబై: ఒక వన్డే మ్యచ్‌లో 10 బ్యాటర్లు కలిసి 300లకు పైచీలు స్కోరు చేస్తే భారీ స్కోరు అంటారు.. అదే ఒక మ్యాచ్‌లో ఓ మహిళా బ్యాటర్ 346 పరుగులు చేస్తే విధ్వంసం అంటారు. ముంబై అండర్19 మహిళా బ్యాటర్ ఇరా జాదవ్ చేసింది ఇదే. కేవలం 157 బంతుల్లో 42 పోర్లు, 16 సిక్స్‌లతో త్రిపుల్ సెంచరీతో కదంతొక్కింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ అన్‌సోల్డ్‌గా మిగిలిన 14 ఏళ్ల ఇరా పేరు ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇది అండర్19లో అయినప్పటికీ వన్డేల్లో త్రిపుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఇరా జాదవ్ చరిత్ర సృష్టించింది.

ముంబైకి తరఫున బిరలోకి దిగిన ఇరా మేఘాలయతో అండర్19 వన్డే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించింది. ఆమెకు తోడు ఆ జట్టు సారథి హుగ్లె గాలా సయితం సెంచరీతో చెలరేగడంతో ఓ వన్డే మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి సాధించే స్కోరు మొత్తాన్ని ముంబై ఒక్క జట్టే చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లే కోల్పోయి 563 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి 33 బంతుల్లో 64 పరుగులు చేయడం మరో విశేషం. ఇక అనంతరం లక్ష ఛేదనకు దిగిన మేఘాలయ.. ముంబై బౌలర్ల ధాటికి 19 పరుగులకే కుప్పకూలింది. దీంతో 544 పరుగుల తేడాతో ముంబై విజయ ఢంకా మోగించింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు 544 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News