Monday, January 13, 2025

సంజయ్ వర్సెస్ కౌశిక్ రెడ్డి… ఏ పార్టీలో ఉన్నావో చెప్పు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేల ఘర్షణ జరిగింది.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ హుజురాబాద్ ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. ఇద్దరు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో సమీక్షా సమావేశం రసాభాసంగా మారింది. ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సాక్షిగా ఇద్దరు ఎమ్మెల్యేల వాగ్వాదం చేసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటికి లాకెళ్లారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏ హోదాతో మాట్లాడుతున్నాడని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ బిక్షతో సంజయ్ ఎమ్మెల్యే అయ్యారని, కాంగ్రెస్ కు అమ్ముడు పోయారని ధ్వజమెత్తారు.

సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరును ఖండిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  దురదృష్టకరమైన సంఘటన ఇది అని, రాజకీయాల్లో ఎవరున్నా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అందరిని అహ్వానించామన్నారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ మాట్లాడినప్పుడు ఏ పార్టీ అని ఎందుకు అడగలేదని ఉత్తమ్ నిలదీశారు. సమావేశాన్ని పక్కదారి పట్టించడానికి రాజకీయ దురుద్దేశంతో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించినట్లు భావిస్తున్నామన్నారు.

Sanjay vs Kaushik reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News