- Advertisement -
మార్చి 23 తొలి మ్యాచ్
మే 25న ఫైనల్
ఐపిఎల్ 2025 షెడ్యూల్ విడుదల
ప్రకటించిన బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా
ముంబై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఐపిఎల్ 2025 షెడ్యూల్ రానే వచ్చింది. మార్చి చివరి వారం నుంచి ప్రారంభంకానున్న ఈ మెగా సంగ్రామంతో క్రికెట్ పండగ చేసుకోనున్నారు. ఈ మెగా లీగ్ షెడ్యూల్‌ను బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆదివారం ప్రకటించాడు. మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని, మే 25న ఫైనల్ మ్యాచ్‌తో ఈటోర్నీ ముస్తుందని తెలిపారు. త్వరలో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని శక్లా తెలిపారు. ముంబైలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. బిసిసిఐ సెక్రటరీగా కొత్తగా నియామితులైన దేవజిత్ సైకియా, ట్రెజరీ ప్రభ్‌తేజ్ ఈ సమావేశం పాల్గొన్నారు.
- Advertisement -