Monday, January 13, 2025

బిసి రిజర్వేషన్‌.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి: ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

బిసి రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదానికి
వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుపాలి
సిఎంకు ఆర్.కృష్ణయ్య లేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : స్థానిక సంస్థలు ఎంపిటిసి, జెడ్‌పిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్‌లను 42 శాతా నికి పెంచడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి చట్టం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి. ఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వచ్చే నెల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఒకవైపు ప్రభుత్వం దాదాపు కులాల వారి లెక్కలు తీసిందని, జనాభా ప్రకారం లెక్కలు ఉంటే రిజర్వేషన్‌లు పెంచవచ్చని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పు చెప్పిందని కృష్ణయ్య అన్నారు.

ఒకవైపు చట్టబద్ధమైన బిసి కమిషన్ సిఫార్సు, ఇంకొక వైపు అసెంబ్లీలో చట్టం చేస్తే, న్యాయపరమైన, చట్ట పరమైన అవరోధాలు ఉండవని కృష్ణయ్య అన్నారు. అసెబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ పెట్టాలని సూచించారు. స్థానిక సంస్థలలో ఎన్నికలపై గ్రామాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయని, బిసి రిజర్వేషన్లు పెంచుతారని బిసిలు ఎదురు చూస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరపాలని కృష్ణయ్య సూచించారు. రిజర్వేషన్లు పెంచుతామని ఆశలు కల్పించారని, ఇప్పుడు ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా రిజర్వేషన్‌లు పెంచే వరకు వదిలే ప్రసక్తి లేదని కృష్ణయ్య హెచ్చరించారు.

బిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
ఎంపి కృష్ణయ్యకు బిసి ఉద్యోగుల వినతి

బిసి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బిసి ఉద్యోగులు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్యకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బిసిటిఎ డైరీ, క్యాలెండర్ లను బిసి భవన్‌లో ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిసిటిఎ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు నేతృత్వంలో బిసి ఉద్యోగులు ఆర్.కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు. బిసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్ కల్పించాలని, క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని, 317 జీఓ నందు స్థానికతకు అవకాశం లేకుండా గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి పూర్తిగా అన్యాయం జరిగిందని స్థానికతను పరిగణనకు తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, 317 జీఓలో బిసిలకు ఉన్న రిజర్వేషన్‌ను అమలు చేయకుండా ఉపాధ్యాయ, ఉద్యోగులను జిల్లాలకు కేటాయించడం వల్ల బిసి ఉద్యోగ ఉపాధ్యాయులకు పూర్తి అన్యాయం జరిగిందని కృష్ణయ్య దృష్టికి తెచ్చారు. స్థానికత, బిసి రిజర్వేషన్ అమలయ్యే విధంగా పార్లమెంట్లో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షులు నారాయణ యాదవ్, కార్యదర్శి రాందాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్, ధనంజయ, రవికుమార్, శ్రీనివాస్, సుభాష్, వేణు, శివకుమార్, వినోద్, కృష్ణమోహన్, మొదలగు వారు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News