మేషం – ఆనందకరమైన వాతావరణ ఏర్పడుతుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. యత్న కార్యసిద్ధి గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సిన తరుణం.
వృషభం – కొన్ని విషయాల్లో మనో నిబ్బరం అవసరం అవుతుంది. కీలక లావాదేవీలు జరుపుతారు. నిపుణులను సంప్రదించి లావాదేవీలు జరపడం శ్రేయస్కరం. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి.
మిథునం – అనవసర ఖర్చులు అధికమవుతాయి. ఒక శుభవార్త మీకు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మేలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం – పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. తోటి వారి సహాయంతో అనుకున్న పనులను చకచకా పూర్తి చేస్తారు. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు.
సింహం – చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరు వ్యక్తుల ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది.
కన్య – అనుకున్నది సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సన్నిహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు.
తుల – శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మానసిక సంతోషం కలిగి ఉంటారు. బంధువులతో మాట పట్టింపు సూచనలున్నాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
వృశ్చికం – కీలకమైన విషయాల్లో తగిన జాగ్రత్తల అవసరం. అనవసర ఖర్చులు అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ప్రశాంతమైన ఆలోచనలతో రోజు గడుస్తుంది.
ధనుస్సు – సమర్థతను పెంచుకోగలుగుతారు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. శుభ ఫలితాలు అందుకుంటారు. దూరం బంధువులను కలిసి ఆనందంగా సమయం గడుపుతారు.
మకరం – రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. మానసికంగా సంతోషం కలిగి ఉంటారు. పనులు భక్తిశ్రద్ధలతో పూర్తి చేయగలుగుతారు. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన.
కుంభం – మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. స్నేహితులు సన్నిహితులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం – ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసే వారు ఉంటారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు.