Monday, January 13, 2025

లాస్ ఏంజిల్స్ లో ఆగని కార్చిచ్చు.. 24కు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరింది. మరో 16 మందికి పైగా తప్పిపోయారు. ఇప్పటివరకు వందల ఇండ్లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇటీవల లాస్ ఏంజిల్స్ లోని అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగిన సంగతి తెలసిందే. భారీగా గాలులు వీస్తుండటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి.

ఈ కార్చిచ్చును ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఇంకా వ్యాపిస్తుండటంతో విధ్వంసకర పరిస్థితులు ఉన్నాయని అధికారులు తెలిపారు. బలమైన గాలులు బుధవారం వరకు ప్రమాదాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 80 కి.మీ నుంచి 113 కి.మీ వరకు గాలులు వీస్తాయని అంచనా వేసింది. దీంతో మంగళవారం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉందొచ్చని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News