Thursday, February 13, 2025

ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో అదుపులోకి
తీసుకున్న కరీంనగర్ పోలీసులు
కలెక్టరేట్‌లో ఎంఎల్‌ఎ సంజయ్‌తో
దురుసు ప్రవర్తనపై మూడు కేసులు
నమోదు కౌశిక్‌రెడ్డి వ్యవహారశైలిపై
స్పీకర్ ఆగ్రహం చర్యలు
తీసుకోవాలని సభాపతికి ఫిర్యాదు
అరెస్టు దుర్మార్గమైన చర్య
ప్రశ్నిస్తే అణిచివేతలా? : కెటిఆర్
బేషరతుగా విడుదల చేయాలని
బిఆర్‌ఎస్ డిమాండ్

హుజురాబాద్ ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ టీవీ చానెల్ డిబేట్ ప్రోగ్రాంలో పాల్గొని బయటకు వచ్చినప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఆయనపై మూడు కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పీఏ కత్తురోజు వినోద్ అలియాస్ గిరి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.

ఈ నేఫథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా శాసనసభ స్పీకర్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ వన్ టౌన్ కు చేరుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కౌశిక్ రెడ్డి తీరుపై ఘాటుగా స్పందించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ వెల్లింది. రాత్రి ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కోర్టులో హాజరు పర్చనున్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News