అందాల తార నిధి అగర్వాల్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ’హరి హర వీరమల్లు’, ’ది రాజాసాబ్’ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. కానీ అవి రెండూ ఇంకా సెట్స్ మీదనే ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ఈ సినిమాలు తప్ప ఇతర సినిమాలకు ఆమె సైన్ చేయలేదని తెలిసింది. తాజాగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ “ఫస్ట్ లాక్ డౌన్‌కు ముందే ’హరిహర వీరమల్లు’ సినిమాకు సైన్ చేశాను. ఈ సినిమాకు దాదాపు మూడున్నర నుంచి నాలుగేళ్లు పట్టింది. ఈ సినిమా పూర్తయ్యే వరకు ఇతర సినిమాలు ఒప్పుకోకూడదని నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా అందుబాటులో ఉండాలని ప్రొడక్షన్ టీమ్ కోరింది.
అందుకే ఆఫర్స్ వచ్చినా నేను వేరే సినిమా ఏదీ చేయలేదు. షూటింగ్ ప్రారంభించిన తర్వాత మరో లాక్ డౌన్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు చాలా సమయం పట్టింది. ఇక ‘రాజాసాబ్ లో నటించే అవకాశం వచ్చినప్పుడు, ఇలాంటి బిగ్ ఫిల్మ్‌లో భాగం కావాలని, ఈ సినిమా వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. ’హరి హర వీరమల్లు’ మూవీ టీమ్‌తో మాట్లాడితో, ’ఓకే సినిమా చేసుకోండి, ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దాం’ అని చెప్పారు. అయితే ఆతర్వాత మరో సినిమాకు నేను సైన్ చేయలేదు. మొదటి రోజు నుంచే వీరమల్లు చిత్రం మీద నాకు చాలా నమ్మకం వుంది. రాజాసాబ్, వీరమల్లు రెండూ వేటికవే భిన్నమైన సినిమాలు. ఈ సినిమాలతో 2025 సంవత్సరం నాకు బాగా కలిసొస్తుందని ఆశిస్తున్నాను”అని పేర్కొంది.