Wednesday, January 15, 2025

బ్లాక్ మండే

- Advertisement -
- Advertisement -

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్లకు ‘బ్లాక్ మండే’గా మారింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా కొనసాగడం భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోయాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత పతనమైంది. స్టాక్ మార్కెట్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,048 పాయింట్లు పతనమై 77,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆఖరికి 76,330 పాయింట్ల వద్ద ముగిసింది.

న్యూఢిల్లీ : దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్లకు ‘బ్లాక్ మండే’గా మారింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా కొనసాగడం భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోయాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత పతనమైంది. స్టాక్ మార్కెట్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,048 పాయింట్లు పతనమై 77,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆఖరికి 76,330 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 345 పాయింట్లు పతనమై 23,085 పాయింట్లకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ లో ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.4.22 లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 26 క్షీణించగా, 4 మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 50 స్టాక్స్‌లో 46 నష్టపోగా, 4 మాత్రమే పెరిగాయి. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ రియాల్టీ అత్యధికంగా 6.47 శాతం, నిఫ్టీ మీడియా 4.54 శాతం, నిఫ్టీ మెటల్ 3.77 శాతం పడిపోయాయి. మార్కెట్ అస్థిరతను కొలిచే ఇండియా విక్స్ 6.77 శాతం పెరిగింది.

రష్యా చమురుపై ఆంక్షల ఎఫెక్ట్
రష్యా చమురు కంపెనీలపై అమెరికా తాజాగా కఠిన ఆంక్షలు విధించడంతో భారత్‌కు సమస్యలు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం భారత్‌కు కష్టం కానుంది. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అమెరికా నిర్ణయంతో ముడి చమురు ధర బ్యారెల్‌కు నాలుగు నెలల గరిష్ఠ స్థాయి 81.44 డాలర్లకు చేరుకుంది. జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసే వరకు మార్కెట్‌లో అస్థిరత వాతావరణం కొనసాగవచ్చు. దీంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడే ధోరణి కొనసాగే అవకాశం ఉంది. ట్రంప్ పాలసీ ప్రకటనల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి.

మార్కెట్ పతనానికి 3 కారణాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌లో వరుసగా అమ్మకాలు జరుపుతున్నారు. డిసెంబర్‌లో రూ.16,982 కోట్లకు విక్రయించారు. జనవరిలో ఎఫ్‌పిఐలు ఇప్పటివరకు రూ.21,350 కోట్లకు పైగా షేర్లను సేల్ చేశారు. జనవరి 10న విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ.2,254 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
భారత రూపాయి పతనం కారణంగా మార్కెట్‌పై ఒత్తిడి నెలకొంది. సోమవారం యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి లైఫ్‌టైమ్ కనిష్ట స్థాయి రూ.86.27కి చేరుకుంది. డాలర్ బలపడటంతో భారత కరెన్సీ ఒత్తిడికి గురైంది.
గత శుక్రవారం విడుదలైన అమెరికా జాబ్ డేటా కారణంగా ప్రపంచ మార్కెట్‌లో భయానక వాతావరణం నెలకొంది. డిసెంబరులో అమెరికా నిరుద్యోగిత రేటు 4.1 శాతానికి క్షీణించింది. అయితే ఉద్యోగ వృద్ధి బలంగా ఉంది. ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపును నిలిపివేయవచ్చనే భయం ఉంది. దీంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News