Wednesday, January 15, 2025

కొత్త రేషన్‌కార్డుల మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారుల
వివరాలతో ఫ్లెక్సీలు సంక్షేమ పథకాల అమల్లో
ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం రేషన్‌కార్డుల
జారీ నిరంతర ప్రక్రియ భూమి లేని వ్యవసాయ
కుటుంబం 20 రోజులు ఉపాధి హామీ పనులు
చేస్తే ఇందిరమ్మ భరోసా వర్తింపు
వ్యవసాయయోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు
భరోసా కులాలు, పార్టీలకతీతంగా ప్రతి
పేదకు ఇందిరమ్మ ఇల్లు పథకాల
సమీక్షాసమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి
విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు(ఆహార భద్రత కార్డులు) మంజూరుపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డులు లేనివారికి అవకాశం కలుగుతుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సులకు లోబడి కొత్త ఆహార భద్రత(రేషన్) కార్డుల జారీకి సంబంధించి అర్హత ప్రమాణాలు, విధానాలు పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమిషనర్‌కు పరిశీలన కోసం పంపిస్తారు.

మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు ఈ ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారు. ముసాయిదాజాబితాను గ్రామసభ వార్డులో ప్రదర్శించి చర్చిస్తారు. గ్రామసభ ఆమోదం తదుపరి లబ్ధిదారుల లాగిన్‌లో నమోదుచేసి జిల్లా కలెక్టర్, హైదరాబాద్‌లో అయితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపిస్తారు. వారి పరిశీలన తదుపరి ఫైనల్ జాబితాను రూపొందిస్తారు. అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క అహార భద్రత(రేషన్)కార్డు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆహారభద్రత కార్డుల్లో కుటుంబసభ్యులు చేర్పులు, తొలగింపులు చేసే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News