Wednesday, January 15, 2025

4 పథకాలు.. రూ.45వేల కోట్ల ఖర్చు

- Advertisement -
- Advertisement -

గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారుల
వివరాలతో ఫ్లెక్సీలు సంక్షేమ పథకాల అమల్లో
ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం రేషన్‌కార్డుల
జారీ నిరంతర ప్రక్రియ భూమి లేని వ్యవసాయ
కుటుంబం 20 రోజులు ఉపాధి హామీ పనులు
చేస్తే ఇందిరమ్మ భరోసా వర్తింపు
వ్యవసాయయోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు
భరోసా కులాలు, పార్టీలకతీతంగా ప్రతి
పేదకు ఇందిరమ్మ ఇల్లు పథకాల
సమీక్షాసమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి
విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించే నాలుగు సంక్షేమ పథకాలకు రూ.45 వేల కోట్ల నిధులను ఖర్చు చేయబోతుందని డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాల అమలుపై ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో క లిసి సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మా ట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ళకు రూ .22 వేల 500 కోట్లు, రైతు భరోసా పథకానికి రూ. 18 వేల కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.2వేల కోట్లు, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేస్తున్నామ ని అన్నారు. ఈ నాలుగు కొత్త పథకాల అమలులో ఎక్కడ ఎవరికీ సందేహాలు అవసరం లేదని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక, అమలుకు సంబంధించి విధి విధానాలు లోతుగా చర్చించిన తర్వాతే కేబినెట్ ప్రకటన చేసిందని తెలిపారు. ప్రతి పథకంపై సంపూర్ణంగా చర్చించి మార్గదర్శకాలు జారీ చేశామని అన్నారు.

రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా, వ్యవసాయశాఖ రైతు భరోసా పథకాన్ని అమలు చే స్తామని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉండి భూమి లేని వ్యవసాయ కుటుంబాలు 20 రోజులు ఉపాధి హామీ పనిచేసినట్లయితే ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకం అమలవుతుందని అన్నారు. ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను పారదర్శకంగా గ్రామసభల్లో ఎంపిక చే యాలన్నారు. ఇందులో ఇందిరమ్మ కమిటీల సభ్యులను భాగస్వామ్యం చేయాలని, ప్రతి గ్రామసభలో కార్యక్రమం పెట్టి ప్రభుత్వ లక్ష్యాలు తెలియజేయాలని కోరారు. ఇచ్చిన మాట మేరకు దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధం గా రెండు నెలల వ్యవధిలో రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లోకి రూ. 22 వేల కోట్లు జమ చేసినప్పటికీ పెద్దగా ప్రచారం జరగలేదని అన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల నుంచి అమలు చేయబోయే నాలుగు కొత్త పథకాలకు గ్రామసభలు ఏర్పాటు చేసి అందరికీ తెలిసే విధంగా

పథకాలు అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరడం ఎంత ముఖ్యమో, అనర్హులకు అందకుండా వృథా కాకుండా చూడడం కూడా అంతే కీలకమని తెలిపారు. భూసేకరణ జరిగిన భూములు, రా ళ్లు, రప్పలు ఉన్న భూములు కాకుండా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం అందుతుందని అన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రూ.12 వేలు అందిస్తామని, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఆహారభద్రత చట్టాన్ని దేశంలో ప్రవేశపెట్టారని, నూతన రేషన్ కార్డుల జారీ, కార్డులలో నూతన సభ్యుల నమోదు వివరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. నూతన రేషన్ కార్డుల జారీ అం శంలో అధికారులు మానవీయ దృక్పథంతో పనిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ..

అధికారులు అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఎక్కడా పెట్టుబడి సహాయం చేరవద్దని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన వారి కి సహాయం అందేలా చూడాలని కోరారు. లే అవుట్, నాలా, భూసేకరణ, పరిశ్రమల, మైనింగ్ భూముల సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, గ్రామ శాటిలైట్ మ్యాప్ ద్వారా పారదర్శకంగా అర్వులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పంట వేసినా, వేయక పోయినా రైతు భరోసా అందుతుందని స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూ మి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. 20 రోజులు ఉపాధి హామీ పనిచేసి, గుంట భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలను గుర్తించి ఈ పథకం అమలు చేయాలని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నాలుగు పథకాలకు సంబంధించి గ్రామసభలు నిర్వహిం చి అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలని కోరారు. ఈ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని సూచించారు.

గిరిజన ప్రాంతాల్లో పేదలు, కులమతాలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 4 లక్షల 50 వేల ఇండ్లు ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపి రఘురాంరెడ్డి, మహబుబాబాద్ ఎంపి బలరాం నాయక్, ఎంఎల్‌ఎలు సాంబశివరావు, మాలోతు రాందాస్ నాయక్, జారే ఆదినారాయణ, డాక్టర్ రాగమయి, కోరం కనకయ్య, డాక్టర్ తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వరు, ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ, భద్రాచలం ఐటిడిఏ. పిఓ రాహుల్, ఖమ్మం జిల్లా పోలీస్ కీషనర్ సునీల్ దత్, కొత్తగూడెం ఎస్‌పి రోహిత్ రాజు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News