- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఇవాళ, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం, మంత్రులు పాల్గొనున్నారు.
ఆ తర్వాత ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులనూ సిఎం రేవంత్ కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన అనంతరం సిఎం సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19వ తేదీ వరకు ఆయన అక్కడే పర్యటించనున్నారు. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటిస్తారని సమాచారం.
- Advertisement -