- Advertisement -
ఢిల్లీ: మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన కెటిఆర్.. ఎల్ఎల్ పి దాఖలు చేశారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కెటిఆర్ పై ఎసిబి, ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు.
అయితే, క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఎసిబి దర్యాప్తు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎసిబి అధికారులు.. కెటిఆర్ ను విచారించారు. మళ్లీ విచారించే అవకాశం ఉంది. అలాగే ఈడీ కూడా విచారణకు రావాలని ఇప్పటికే కెటిఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో హైకోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ కెటిఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు.
- Advertisement -