Wednesday, January 15, 2025

తగ్గేదే లే.. అమెరికాలో ఆగని కార్చిచ్చు విధ్వంసం..

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు విధ్యంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుతో ఇప్పటికే వందల ఇండ్లు బూడిదయ్యాయి. ఇందులో పలువురు హాలివుడ్ హీరోల ఇండ్లు కూడా ఉన్నాయి. కార్చిచ్చు కారణంగా ఇప్పటికే 24 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 88వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వారం రోజులు గడిచినా కార్చిచ్చు మాత్రం తగ్గేదేలే అన్నట్లు విజృంభిస్తోంది. దీంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బలమైన గాలులు వీస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక, కాలిఫోర్నియాలో బలమైన గాలులు వీస్తాయని.. దీంతో మంటల వ్యాప్తి పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News