Wednesday, January 15, 2025

కేజ్రీవాల్‌కు షాక్.. విచారించేందుకు ఈడీకి అనుమతి..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఊహించని షాకిచ్చింది కేంద్ర హోంశాఖ. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి అనుమతిచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఆయన బెయిల్ ఇచ్చిన సమయంలో.. మళ్లీ విచారించాలంటే..ఈడీ, కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ క్రమంలో తాజాగా హోంశాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో మళ్లీ కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News