- Advertisement -
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. దీనికి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పేరు పెట్టారు. కొద్దిసేపటిక్రితం ‘ఇందిరా భవన్’ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోయినా గాంధీ ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సానికి ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇందిరా గాంధీ.. వారసత్వం, దేశానికి, పార్టీకి ఆమె చేసిన సేవలకు నివాళిగా ఢిల్లీలోని కోట్లా రోడ్‌లో ఈ కొత్త కార్యాలయం నిర్మించారు.
- Advertisement -