ముంబై: ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం ఉదయం ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో 3 నేవీ అధునాతన యుద్ధనౌకలను ప్రధాని ప్రారంభించారు. INS సూరత్, INS నీలగిరి యుద్ధ నౌకలు, INS వాఘ్‌షీర్ జలాంతర్గామిని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ యుద్ధ నౌకలు భారత్ కు మరింత శక్తిని ఇస్తాయన్నారు. ఈ మూడు యుద్ద నౌకలు మేడిన్ ఇండియా అని అన్నారు.
రక్షణ రంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందని చెప్పారు.అంతర్జాతీయ కార్గో మార్గాలను భారత్ రక్షిస్తోందని.. భద్రమైన సముద్ర మార్గాల కోసం ప్రయత్నిస్తున్నామని ప్రధాని అన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ లక్ష్యంతో పనిచేస్తామని.. మేము విస్తరణవాదంతో కాదు.. వికాసవాదంతో పనిచేస్తున్నామన్నారు. నేవి బలోపేతం వల్ల ఆర్థక ప్రగతి కూడా కలుగుతుందని షిప్ బిల్గింగ్ వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.