ఫార్ములా ఈ రేస్ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లినా మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఊరట లభించలేదు. ఆయన తన క్వాష్ పటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కెటిఆర్ సుప్రీంకోర్టు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన ఎస్ఎల్ పి పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కెటిఆర్ లాయర్, ప్రభుత్వ లాయర్లు తమ వినిపించారు.
అనంతరం సుప్రీంకోర్టు మాట్లాడుతూ.. ఈ కేసులో విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. మీకు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో కెటిఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు ఆయన తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. మరోవైపు, రేపు విచారణకు రావాలని కెటిఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.