- Advertisement -
హైదరాబాద్: యువకుడిపై మరో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మచ్చ బొల్లారంలోని గోపాల్ నగర్ కు చెందిన యువకుడి ఓ యువతిని ప్రేమించాడు. దీంతో మా చెల్లిని ప్రేమిస్తావా అని యువకుడిపై ఆమె సోదరుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ప్రియుడు తీవ్రంగా గాయపడడంతో గాందీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -