- Advertisement -
కాటేదాన్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ రోజున పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తుండగా భవనం పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాధవ రావు అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి భవనం పైనుంచి గాలిపటాలు ఎగురువేస్తుండగా కిందపడ్డాడు. వెంటనే అతడి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
- Advertisement -