Thursday, January 16, 2025

ఢిల్లీలో కాంగ్రెస్ కంటే ఆప్‌కే బలం అధికం

- Advertisement -
- Advertisement -

హరిద్వార్ : సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఇండియా కూటమి చెక్కుచెదరకుండా ఉందని స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కన్నా బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తాను మద్దతు ఇస్తున్నానని, బిజెపిని ఓడించడమే ఉమ్మడి ధ్యేయమని అఖిలేశ్ వెల్లడించారు. అఖిలేశ్ యాదవ్ హరిద్వార్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్ష కూటమి ఏర్పాటు వెనుక ప్రధాన సూత్రం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న, బిజెపితో పోరు సాగించే స్థితిలో ఉన్న చోట్లల్లా ఆ పార్టీలను పటిష్ఠం చేయడమే అని చెప్పారు. తన సమీప బంధువు రాజ్‌పాల్ యాదవ్ అస్థికలను హర్ కీ పౌరి వద్ద గంగా నదిలో నిమజ్జనం చేయడానికి ఆయన హరిద్వార్‌కు వచ్చారు.

‘ఇండియా కూటమి చెక్కుచెదరకుండా ఉంది. కూటమిని ఏర్పాటు చేసినప్పుడు మాతో సహా అన్ని పార్టీల నేతలతో నితీశ్ కుమార్ మాట్లాడినట్లు నాకు గుర్తు. ఏదైనా పార్టీ బలంగా ఉన్న చోట దానికి మద్దతు ఇవ్వాలని ఆ సమయంలో ఆయన అన్నారు. ఢిల్లీలో ఆప్ బలంగా ఉంది. అందుకే మేము ఆ పార్టీని సమర్థిస్తున్నాం’ అని ఎస్‌పి అధినేత చెప్పారు. ‘ఏ పార్టీ బలంగా ఉన్నా, బిజెపితో పోరాడే స్థితిలో ఉన్నా ఆ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలి. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పరస్పరం పోటీ చేస్తున్నాయి& ఆప్ మరింత బలంగా ఉన్నందున మనం అంతా దానిని సమర్థించాలని నా సలహా. ఏమైనా కాంగ్రెస్, లేదా సమాజ్‌వాది పార్టీ లేదా ఆప్ అయినా బిజెపిని ఓడించడమే మా ఉమ్మడి లక్షం’ అని అఖిలేశ్ స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి ఇడికి కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ అనుమతి ఇవ్వడంపై స్పందనను కోరినప్పుడు, బిజెపి ప్రభుత్వాల పని అదే విధంగా ఉంటుందని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. ‘వారు ఎక్కడ అధికారంలో ఉన్నా నిరంకుశంగా పాలిస్తుంటారు’ అని అఖిలేశ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News