Friday, January 24, 2025

ఉల్ఫా నేత పరేష్ బారువా ఖైదు తగ్గింపు

- Advertisement -
- Advertisement -

ఢాకా : బంగ్లాదేశ్ ఆయుధాల చట్టం కింద ఒక కేసులో వేర్పాటువాద ఉల్ఫా నేత పరేష్ బారువా యావజ్జీవ కారాగార శిక్షను 14 సంవత్సరాల కారాగార శిక్షగా బంగ్లాదేశ్ హైకోర్టు తగ్గించి. ఇతరులు పలువురిని నిర్దోషులుగా విడుదల చేసింది. ‘ఉల్ఫాకు చెందిన పరేష్ బారువా, నలుగురు బంగ్లాదేశీయుల యావజ్జీవ కారాగార శిక్షను ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తగ్గించింది’ అని అటార్నీ జనరల్ బ్యూరో అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. అస్సాంలోని ఉల్ఫా రహస్య స్థావరాలకు పది లారీల నిండా ఆయుధాల అక్రమ రవాణాకు ప్రయత్నించారనే రెండు అభియోగాల కింద 2014లో ప్రస్తుతం పరారీలో ఉన్న ఉల్ఫా మిలిటరీ కమాండర్ పరేష్ బారువాను.

బంగ్లాదేశ్ హోమ్ శాఖ మాజీ జూనియర్ మంత్రి, మాజీ మిలిటరీ జనరల్స్, పౌర అధికారులు, ప్రైవేట్ పౌరులు సహా పలువురు బంగ్లాదేశీయులను దోషులుగా నిర్ధారించడమైంది. హైకోర్టు నిరుడు డిసెంబర్ 18న బారువా మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్ష స్థాయికి తగ్గించింది. చైనాలో నివసిస్తున్నట్లుగా భావిస్తున్న బారువాకు 2014లో పరోక్ష విచారణలో మరణ శిక్ష విధించారు. అతని పేరు భారత్ ఎన్‌ఐఎ ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News