Thursday, January 16, 2025

ఆతిశీ జింకలా పరుగెడుతున్నారు..

- Advertisement -
- Advertisement -

మరోసారి నోరు జారిన బిధూడీ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సిఎం ఆతిశీపై బీజేపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ రమేశ్ బిధూడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలను పట్టించుకోని ఆతిశీ , ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం నగరవ్యాప్తంగా జింకలా పరుగెడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘ ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. నగర వీధుల పరిస్థితి చూడండి. గడిచిన నాలుగేళ్లలో ఆతివీ ఎప్పుడూ ఈ సమస్యలను పట్టించుకోలేదు.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడవిలో జింకలా ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారు ” అని రమేశ్ బిధూడీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆతిశీ ఇంటిపేరు మార్చుకుందని గతవారం ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద ప్రకటనలు చేయడం బిధూడీకి ఇదేం మొదటిసారి కాదు.

బీఎస్పీ నేత డానిష్ అలీని దూషించడం మొదలు. ప్రియాంక గాందీ వంటి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు బీజేపీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిధూడీ ఉండనున్నారనే ప్రచారం జరిగింది.అయితే వీటిని తోసిపుచ్చిన ఆయన బీజేపీ అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News