Thursday, January 16, 2025

మంటలు రేపిన ప్రేమ

- Advertisement -
- Advertisement -

ప్రేమికుడి తండ్రిపై పెట్రోల్ పోసి
నిప్పుపెట్టిన యువతి బాబాయ్
50శాతం గాయాలతో ఆసుపత్రిలో
చేరిన తండ్రి ఈ ఘటనలో పక్కింటి
చిన్నారికి కాలిన గాయాలు

మన తెలంగాణ/అల్వాల్ : ప్రేమ పేరుతో యువ తి వెంట తిరుగుతున్న వ్యక్తిని ఎంత హెచ్చరించి నా వినకపోవడంతో అతని ఇంటిపై పెట్రోల్‌తో దాడి చేసిన సంఘటన అల్వాల్‌లో చోటుచేసుకుం ది. ఈ దాడిలో పక్కింటి చిన్నారితో పాటు యువకుడి తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మచ్చ బొ ల్లారం డివిజన్ ఎరుకల బస్తీ గోపాల్‌నగర్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన హేమలత, ప్రకాష్ దంపతుల కుమారుడు ప్రదీప్‌తో కలిసి కూలి పనులు చే స్తూ రాంబాబుకు చెందిన అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.

ఇదే బస్తిలో చిన్నతనంలోనే తల్లిదండ్రిని కోల్పోయి బాబాయ్ వివేకానంద వద్ద పె రుగుతున్న యువతి కళాశాలలో చదువుతుంది. గత కొంతకాలంగా ప్రదీప్, సదరు యువతి కలిసి తిరుగుతున్నారని తెలిసి వివేకానంద తీవ్రంగా మందలించి వారిని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపొమ్మని హెచ్చరించారు. ఇటీవల మళ్లీ కలిసి తిరుగుతున్నారని తెలుసుకున్న వివేకానంద మంగళవారం రా త్రి కోపోద్రిక్తుడై ముందుగా అమ్మాయిని తీవ్రంగా కొట్టాడు. ఆపై పెట్రోల్ తీసుకొని ప్రదీప్ ఇంటిపై దాడికి వెళ్ళాడు.

ప్రదీప్ తండ్రి ప్రకాష్ (60) ఇం ట్లో ఒకడే ఉండగా కోపంతో ఇంటిపై అతనిపై పె ట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనే నివాసం ఉండే దిలీప్ నాలుగేళ్ల కుమార్తె చాందినికి కూడా మోకాళ్ళ వరకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రకాష్ గాంధీ ఆసుపత్రిలో 50% కాలిన గాయాలతో చికిత్స పొందుతుండగా చాందిని కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాలను సేకరించి అన్ని కోణా ల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News