Thursday, January 16, 2025

సమరయోధులను కించపరిచిన భగవత్

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్రంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలు దేశద్రోహమే
ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లోకి చొచ్చుకుపోయిన
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు మేము ఆ రెండింటితో
పాటు భారత్‌తోనూ కొట్లాడుతున్నాం ఎఐసిసి
కార్యాలయం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్
నైజం బయటపడిందని తిప్పి కొట్టిన బిజెపి జాతీయ
అధ్యక్షుడు జెపి నడ్డా

అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన నాడే దేశానికి
స్వాతంత్రం లభించిందన్న భగవత్ తప్పుపట్టిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్య్రాన్ని పొందిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఆ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ భాగవత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ … ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని, తమ పోరాటంలో న్యాయం ఉందని, దాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తీరుపైనా రాహుల్ గాంధీ ఆగ్రహ వ్యక్తం చేశారు. “లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయానికి మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ఈసీ నిరాకరిస్తోంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత. మన ఎన్నికల వ్యవస్థలో తీవ్రమైన సమస్యలున్నాయి” అని రాహుల్ ఆరోపించారు. అనంతరం నూతన ప్రధాన కార్యాలయం గురించి స్పందిస్తూ “ ఈ కొత్త భవనం కాంగ్రెస్ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెందుతుంది ” అని పేర్కొన్నారు.

రాహుల్ వ్యాఖ్యలతో అసలు నిజం బయటపడింది: బీజేపీ

ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు.. దేశం తోనూ పోరాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుపట్టారు. కాంగ్రెస్ అసలు రూపం ఈ వ్యాఖ్యలతో బహిర్గతమైందని బీజేపీ జాతీయాధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దేశానికి తెలిసిన విషయాన్ని చెప్పినందుకు రాహుల్‌ను అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. రాహుల్ , ఆయన చుట్టూ ఉన్నవారికి అర్బన్ నక్సల్స్‌తో సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

దేశం పరువు తీయాలని , కించపర్చాలని, అప్రతిష్ఠపాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. పదేపదే ఆయన చేస్తున్న పనులు ఈ నమ్మకానికి బలం చేకూర్చాయి. భారత్‌ను ముక్కలు చేసి విభజించాలనే ఉద్దేశం తోనే ప్రతి ఒక్కటీ చేశారు. చెప్పారు. అని ఎక్స్ వేదికగా నడ్డా మండిపడ్డారు. దేశంపై ప్రతిపక్షం పోరాడుతోందని చెబుతున్న రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విపక్ష నేత దేశంతో పోరాడుతున్నామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News