Thursday, January 16, 2025

అర్థరాత్రి..నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి.. ఆస్పత్రికి తరలింపు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నేవీ ముంబయిలోని తన ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు కత్తితో సైఫ్ అలీఖాన్ పై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో గాయపడిన సైఫ్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. సర్జరీ తర్వాతనే ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. అర్థరాత్రి దొంగతనానికి వచ్చిన దుండగుడిని సైఫ్ అడ్డుకోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News