Thursday, January 16, 2025

యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి వెనక నుండి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పెట్రోల్ పంపులోకి వెళ్తున్న లారీని వెనుక నుండి కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాద సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News