- Advertisement -
ఏలూరు: ప్రభుత్వాస్పత్రిలో సేవలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన ఆయన.. రికార్డులను తనిఖీ చేశారు. రోగుల సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యకళాశాల స్థాయిలో ఆస్పత్రిలో సౌకర్యాలు లేదని వైద్య సిబ్బందిని మందలించారు. రోగులను తీసుకెళ్లేందుకు వీల్ చైర్లు లేకపోవడం దారుణమని మంత్రి నాదెండ్ల అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని, పారిశుద్ధ్యం సరిగా లేదని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని పునర్నిర్మాణం చేయాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -