న్యూఢిల్లీ : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలో మూడవ లాంచ్ ప్యాడ్‌ను నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించినట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మూడవ లాంచ్ ప్యాడ్ ద్వారా నెక్ట్ జనరేషన్ లాంచ్ వెహికిల్స్ (ఎన్జీఎల్వీ)ను ప్రయోగించనున్నారు. ఎన్జీఎల్వీ రాకెట్లు భారీ శాటిలైట్లను కక్ష లోకి మోసుకెళ్లగలవని ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు తెలియజేశారు. నాలుగేళ్లలో లాంచ్‌ప్యాడ్‌ను సుమారు రూ. 3985 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు , మనుషులను రోదసీ లోకి పంపడానికి అనుకూలంగా లాంచ్ ప్యాడ్‌ను రూపొందిస్తున్నట్టు చెప్పారు. రోదసీ ప్రయోగాలకు చెందిన మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో ముఖ్యమైన మైలురాయిగా మారనున్నట్టు తెలిపారు. మొదటి, రెండవ ల్యాంచ్ ప్యాడ్లతో పోలిస్తే మూడవ ల్యాంచ్ ప్యాడ్ అధిక సామర్థంతో ఉండనున్నట్టు చెప్పారు.
శ్రీహరికోటలో మూడవ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం
- Advertisement -
- Advertisement -
- Advertisement -