Friday, January 17, 2025

ప్రచారంలో ‘ఏఐ’ …. పార్టీలకు ఈసీ అడ్వైజరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుతం అన్ని రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం కీలకంగా మారుతోంది. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయా పార్టీలు దీన్ని వినియోగిస్తున్నాయి. కొన్నిసార్లు పార్టీలు సృష్టించే తప్పుడు కంటెంట్ ఓటర్ల అభిప్రాయాలను మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) అప్రమత్తం అయింది. ఈ క్రమం లోనే అన్ని పార్టీలకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రచారంలో ఏఐని వినియోగిస్తున్న పార్టీలు , వారు సృష్టించే కంటెంట్ పారదర్శకంగా ఉండాలని ఈసీ సూచించింది. అంతేకాకుండా , అభ్యర్థులు వాటిపై జవాబుదారీతనంతో వ్యవహరించాలని అడ్వైజరీలో పేర్కొంది.

ఈ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన ఆడియో, వీడియోలు ,చిత్రాలపై ఏఐ జనరేటెడ్, సింథటిక్ కంటెంట్ వంటి సంకేతాలను లేబుల్ చేయాలి . ప్రచార ప్రకటనలను వ్యాప్తి చేసే సమయంలో సింథటిక్ కంటెంట్ వినియోగించినా, దానికి డిస్‌క్లైమర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, పార్టీలు ఏఐ ద్వారా నకిలీ కంటెంట్ ను వ్యాపింప చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనివల్ల కలిగే నష్టాల గురించి ఇటీవల ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ కూడా హెచ్చరించారు. నకిలీ కంటెంట్, తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల వేళ బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ కొత్త నిబంధనలతో అడ్వైజరీ జారీ చేసింది. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వేదికగా నైతికత, బాధ్యతాయుతంగా నడుచుకోవాలని గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయం లోనూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News