- Advertisement -
కోల్‌కతా: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపనను అసలైన స్వాతంత్య్ర సాధనతో పోల్చడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం విమర్శించారు. పైగా ఇది చరిత్రను వక్రీకరించే యత్నం అన్నారు.అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనను అసలైన భారత స్వాతంత్య్రంగా ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా వేడుక చేసుకోవాలని భగవత్ అన్నారు. అనేక దశాబ్దాలుగా శత్రువుల దాడులను ఈ మందిరం ఎదుర్కొన్నదని ఆయన అన్నారు. కాగా ‘ఇది జాతి వ్యతిరేకమైనది. దీనిని నేను ఖండిస్తున్నాను. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాఖ్య. దానిని ఉపసంహరించుకోవాలి. మేము దేశ స్వాతంత్య్రాన్ని పరిరక్షించేందుకు అంకితమయ్యాము. భారత్ కోసం మా జీవితాలను కూడా త్యాగం చేస్తాము.కానీ ఇలాంటి యత్నాన్ని సహించము’ అని మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సెక్రటరియేట్ నబన్నలో విలేకరులతో అన్నారు.
- Advertisement -